మంచుకొండల్లో పాలిటిక్స్ మంటపుడుతున్నాయి.. జమ్మూకశ్మీర్ లో కాషాయ జెండాను ఎగరవేసేందుకు కమలనాధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.. కొత్త ఇన్చార్జులను నియమించి.. పరిస్థితిని చేయిదాటిపోకుండా చూస్తున్నారు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. లోకల్ పార్టీలను చావుదెబ్బకొల్టాలని బిజేపీ నేతలు గట్టిగానే పనిచేస్తున్నారు..
లోయలో రాజకీయంగా పట్టు సాధించేందుకు కాషాయదశం ఉవ్విళ్లూరుతోంది.. సింగిల్ గానే బరిలోకి దిగుతామని బిజేపీ ప్రకటించడంతో హీట్ పెరిగింది.. ఎన్నికల ఇన్చార్జుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు.. రామ్ మాధవ్ లకు బాధ్యతలు అప్పగించింది.. వీరు స్వతంత్ర అభ్యర్దులతో పాటు.. ఎన్నికలను ప్రభావితం చెయ్యగలిగే నేతలతో టచ్ లో ఉన్నారనేప్రచారం జరుగుతోంది.. ఇద్దరు నేతలకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవంతో ఉండటంతో ఈసారి గట్టిగానే కొట్టాలనే భావనలో ఆ పార్టీ ఉంది..
గతంలో పీడీపీతో పొత్తుపెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపీ.. ఈసారి స్వంతంగా బలం పెంచుకోవాలని భావిస్తోందట.. 2019లో ఆర్టికల్ 370 రద్దు అయింది.. ఆ ప్రభావం ఎన్నికల మీద ఎక్కువగా ఉండే అవకాశముంది..అది తమను లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.. కశ్మీర్ లోని సమస్యలను తామే పరిష్కరించామని.. ఇక్కడి ఓటర్ల మద్దతుతమకే ఉంటుందని మోడీ సర్కార్ భావిస్తోంది.. కాంగ్రెస్ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.. ఈ హీట్ పాలిటిక్స్ లో ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి..