పరవాడ అగ్ని ప్రమాదంపై హోం మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. విశాఖ జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. అయితే.. ఈ సంఘటనపై హోం మంత్రి అనిత మాట్లాడుతూ…. యాజమాన్యం నిర్లక్ష్యం వలన ప్రాణాలు పోతే ఉరుకోము..ప్రభుత్వం తరపున హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఒక ఘటన జరగక ముందు మరొక దురదృష్ట ఘటన జరిగిందని తెలిపారు.
మానవ తప్పిదం వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఒకరికి 90 శాతం గాయాలు అయ్యాయి..మిగతా ముగ్గురికి 60 శాతం గాయాలు అయ్యాయని తెలిపారు. సూర్యనారాయణ కెమిస్ట్రీ గా ఐదు ఏళ్ళు గా పని చేస్తున్నాడన్నారు. సూర్యనారాయణ భార్య పది రోజులు కిందట డెలివరీ అయింది..బాబు ఐ సి యు లో ఉన్నాడని తెలిపారు. కార్మికులు సేఫ్టీ షూట్ వేసుకునే లా కంపెనీలు చర్యలు తీసుకోవాలని కోరారు. శవాలు మధ్య మేము రాజకీయాలు చేయము… జగన్ ఫీల్డ్ కి వెళ్తాడో ఎయిర్పోర్ట్ కి కూర్చుని మాట్లాడతాడో చూద్దామన్నారు. ఎల్జి పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ పోర్ట్ కి యాజమాన్యాన్ని పిలిపించుకుని జగన్ మాట్లాడి వెళ్లిపోయాడని చురకలు అంటించారు.