నాని శ్యామ్ సింగరాయ్ రివ్యూ – బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్

-

నేచుర‌ల్ స్టార్ నానీ ద్విపాత్రాభిన‌యంలో వ‌చ్చిన డ్రామా థ్రిల్ల‌ర్ సినిమా శ్యామ్ సింగ‌రాయ్. రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. వెంక‌ట్ బోయ‌న‌ల్లి నిర్మాత గా వ్య‌వ‌హ‌రించాడు. హీరోయిన్స్ గా సాయిప‌ల్లివి తో పాటు కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌టించారు. ఈ సినిమా కోల్‌క‌త్తా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా పున‌ర్జ‌న్మ నేప‌థ్యంలో సాగుతుంది. అయితే ఈ నెల 24 న తెలుగు తో పాటు తమిళ, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల‌లో థీయేట‌ర్ల‌లో విడుద‌ల అయింది. అయితే భిన్నమైన క‌థతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన నానికి హిట్ ల‌భించిందో లేదో చూద్ధం.

క‌థ :
వాసుదేవ్ (నాని) ఫిల్మ్ మేక‌ర్ అవ్వాల‌ని గోల్ తో ఉంటాడు. అలాగే కృతి శెట్టి తో ఒక‌ షార్ట్ ఫిల్మ్ ను కూడా చేస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ హిట్ కావ‌డంతో వాసుకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తాయి. అయితే వాసుకు మెంటల్ గా డిస్ట‌బ్ అవుతాడు. త‌న‌కు కోల్‌క‌త్త కు ఏదో సంబంధం ఉంది అని న‌మ్ముతాడు. అలాగే త‌న‌కు వ‌చ్చిన ఆలోచినల ఆధారంగా దీంతో 1970 లో జరిగిన ఒక క‌థ ఆధారంగా ఒక సినిమా తీయాల‌ని వాసు చూస్తాడు. అయితే కాఫీ రైట్స్ వివాదంతో వాసు అరెస్టు అవుతాడు. అయితే 1970 లో కోల్‌క‌త్త‌లో ఏం జ‌రిగింది.? శ్యామ్ సింగరాయ్ కు వాసుకు మ‌ధ్య సంబంధం ఎంటి? శ్యామ్ సింగ‌రాయ్ ఏ విష‌యంలో పోరాటం చేశాడు? ఎందుకు అని తెలియాలంటే..? సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
హీరో నాని రెండు విభిన్న పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. నాని వాసు కంటే.. శ్యామ్ సింగ‌రాయ్ పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను బాగా మెప్పించాడు. కోల్‌క‌త్త లో బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే సన్నివేశాలు బాగున్నాయి. హీరోయిన్స్ గా కృతి శెట్టి పర‌వాలేదు అనిపించినా.. సాయి ప‌ల్లివి పాత్ర మాత్రం ఛాలెంజింగ్ గా ఉంటుంది. అలాగే న‌టీన‌టులకు తోడు టెక్నిక‌ల్ టీం కూడా సినిమా కోసం బాగానే క‌ష్ట ప‌డ్డారు. కెమెరా ప‌ని తీరు బాగుంది.

ప్ల‌స్‌లు :
నాని, సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌
విభిన్న మైన క‌థ‌
సాంగ్స్
స్క్రీన్ ప్లే

మైన‌స్‌లు :
శ్యామ్ సింగ‌రాయ్ మ‌ర‌ణం లాజిక్
సెకండాఫ్ లో సీన్ల సాగ‌దీత

రివ్యూ : 3.5\5

Read more RELATED
Recommended to you

Latest news