చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ మృతి చెందారు. 95 సంవత్సరాలు ఉన్నా సేతు మాధవన్.. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో మరణించారు.

1961 సంవత్సరంలో మలయాళం లో.. దర్శకుడి గా కెరీర్ మొదలు పెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషలలో 60 సినిమాలకు పైగా దర్శకుడి గా వ్యవహరించారు. ఇక తెలుగులో 1960 సంవత్సరంలో వచ్చిన స్త్రీ సినిమాను సేతు మాధవ డైరెక్ట్ చేశారు. ఇక తన కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్నారు సేతు మాధవన్. ఇక ఆయన మరణవార్త తెలిసిన ప్రముఖులు.. ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి, మరణించిన సంగతి తెలిసిందే.