హడలెత్తిస్తున్న నాని దర్శకుడి కొత్త సినిమా మోషన్ పోస్టర్ ..!

-

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ కి పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నిర్మాతగా మారి నాని నిర్మించిన మొదటి సినిమా “అ”. వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ కాకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని కైవసం చేసుకుంది. దాంతో టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ బాగా పాపులర్ అయ్యాడు.

 

ఇక ప్రశాంత్ వర్మ తన రెండవ సినిమా కల్కి తోను మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. చెప్పాలంటే ఈ రెండు సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంటిలిజెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడని తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

 

ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాదు మోషన్ పోస్టర్ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. యదార్ధ సంఘటనల ఆధారంగా కరోనా వైరస్ వలన ఏర్పడిన పరిస్థితులు, భయానక సంఘటనలతో పాటు, దానికి పరిష్కారం.. వాక్సిన్ కనుగొనడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక త్వరలో టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news