సీఎం జగన్‌ అసమర్థుడు..ఆయనది చెత్త పరిపాలన – నారా లోకేష్‌

-

సీఎం జగన్‌ అసమర్థుడు..ఆయనది చెత్త పరిపాలన అంటూ ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిఎం జగన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీల వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

ఆయన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు ఏ కోశానా లేదు. చెత్త పరిపాలన, అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వైసీపీకి చెందిన సొంత సామాజిక వర్గం నేతలే తిరుగుబాటు చేస్తున్నారని వెల్లడించారు. ఇతర పార్టీల నేతల అరెస్టులు మాని సిఎం పర్యటనలు ఉన్నప్పుడు వైసిపి నేతల్ని అరెస్ట్ చెయ్యాలని పోలీసులను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే చెత్త పరిపాలనపై ఒళ్ళు మండిన వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన్ని అడ్డుకుని నిలదీసే అవకాశం ఉందన్నారు లోకేష్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version