బాల‌య్య ‘రూలర్’ ట్రైలర్‌పై నారా లోకేష్ ట్వీట్‌..

-

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బాలకృష్ణ 105వ సినిమా ‘రూలర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగు, టీజర్‌ ఇప్పటికే విడుదల కాగా.. వాటికి మంచి స్పందన లభించింది. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరనస సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే రూల‌ర్ మూవీ ట్రైల‌ర్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.

తన మావయ్య బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ‘సూపర్’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ‘సూపర్’, టోటల్ గా ‘రూలర్’ ట్రైలర్ అదుర్స్’ అని, ‘సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది’ అని లోకేశ్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version