‘ప్రతినిధి-2’తో వస్తున్న నారా రోహిత్.. పోస్టర్ అదిరిందిగా

-

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వైవిధ్య కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు నారా రోహిత్. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రోహిత్.. ఓ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2014లో పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’తో నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు’.

పోస్టర్​లో హీరో నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. తాను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫీ బాధ్యతలు చూస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ సినిమాకు ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news