పోలవరం ప్రాజెక్టు అథారిటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం గేట్లన్ని తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటిని తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ENC మురళీధర్ PPAకు లేఖ రాశారు.
2022 జూలైలో పోలవరం bace వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా… వాటర్ ఇయర్ లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని లేఖలో కోరారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల గురువారం దాకా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడ్రోజులు వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.