యాంకర్ శ్యామల ప్రిపేర్ చేసిన నాటుకోడి పులుసు.. అదుర్స్..!

Join Our Community
follow manalokam on social media

బుల్లితెరపై యాంకర్ శ్యామల గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక బుల్లితెరపై కనిపించే టాప్ యాంకర్ లలో శ్యామల ఒక్కరు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ వారిని అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇక శ్యామల అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంది. బుల్లితెర మీద ఎక్కువగా యాంకర్ రవితో కోయాంకర్ గా, సినిమా ఆడియో ఫంక్షన్లలో, లేడీస్ ప్రోగ్రామ్స్ లో శ్యామల మెరుస్తుంటుంది. ఇక శ్యామల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా శ్యామల చేసిన ఓ వంటకం వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

anchor syamala
anchor syamala

రాయలసీమ అంటేనే రాగి సంగటి, నాటుకోడికి ఫేమస్. మనమంటే ఎప్పుడూ బిర్యానీ, బగారా తింటాం కానీ.. రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. నాటుకోడి, రాగి సంగటి అంటేనే మాంసాహారుల్లో ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన ఈ వంటకం ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానికి చేరింది. స్టార్‌ హోటల్స్‌లో ఖరీదైన వంటకాల మధ్య మరింత ప్రత్యేకమైన ఆహారంగా నిలుస్తోంది. రెస్టారెం ట్లలో ప్రత్యేక వంటకంగా సిద్ధమవుతున్న రాగి సంగటి. అందుకే రాయలసీమ ప్రజలు ఎక్కువగా రాగి సంగటిని తింటుంటారు.

అయితే.. యాంకర్ శ్యామల కూడా ఎప్పుడూ బిర్యానీ, గిర్యానీయేనా అంటూ స్పెషల్ గా ఉండాలని రాగి సంకటిని చేసింది. రాయలసీమ స్పెషల్ రాగి సంగటితో పాటు నాటుకోడి చికెన్ కర్రీని అద్భుతంగా వండేసింది. శ్యామల ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ చూస్తే మాత్రం నోరు ఊరకుండా ఉండదు. అంత బాగుంది రెసీపీ. మీరు కూడా రాగి సంగటి, నాటుకోడి కాంబోను వండాలనుకుంటే వెంటనే ఈ వీడియో చూసేసి ఏంచక్కా వండుకొని తినేయండి.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...