రామతీర్ధం ఘటన : ఇద్దరి అరెస్ట్ !

రామతీర్థ దేవాలయ ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.  దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు, ఇద్దరి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ రంపం ని స్వాధీనం చేసుకున్నారు.  రెండు దేవాలయాల్లో విగ్రహాలను ఎలక్ట్రికల్ రంపంతో దుండగులు కోసినట్టు గుర్తించారు. 

వైజాగ్ కు చెందిన ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరు రెండు దేవాలయాలతో పాటు మరో రెండు చోట్ల దుండగులు రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. ఆలయాల్లోనే కాక కృష్ణా జిల్లాలో అలానే, పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు వైన్ షాపుల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. అయితే వీరిని నేడు పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే వీరికి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న అంశం అయితే బయటకు రాలేదు. వీరు దోపిడీ దొంగలని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.