నయన తార ప్రమోషన్స్ చేసినా లాభం లేదు!ఓటీటీ లో విడుదల.!

-

నయనతార ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి విజయ శాంతి లాగ  ఆమె తెలుగు తమిళ భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా స్టార్ డమ్ ని సొతం చేసుకుంది. మధ్యలో పిల్లల కోసం గ్యాప్ ఇచ్చిన నయన తార మళ్లీ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి పలు సినిమాలు నిర్మిస్తున్న నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది.

నయనతార తన భర్త కలసి నిర్మించిన సినిమా కనెక్ట్ డిసెంబర్ 22న ధియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో వినయ్ రాయ్, సత్యరాజ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా పేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా సొంత సినిమా కాబట్టి నయన తార ప్రమోషన్స్ కార్యక్రమాల లో కూడా చురుకుగా పాల్గొంది. కాని పలితం తేడా కొట్టింది.

థియేటర్స్ లో ఫెయిల్ అయిన తరువాత వెంటనే జనాల కన్ను ఆటోమేటిక్ గా ఓటీటీ డేట్ మీదకు మళ్ళుతుంది . ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ధియేటర్‌లో విడుదలైన 4 వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. అంటే జనవరి నెలాఖరులో కనెక్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news