నయనతార విఘ్నేష్ పై కొలివుడ్ లో హాట్ డిస్కషన్

Join Our COmmunity

నాటీ నయనతార మొత్తానికి విఘ్నేష్ ను లగ్గమాడడానికి డిసైడ్ అయిపోయింది.ఇంతకాలం డేటింగ్ చేసింది చాలు ఇకనైనా అఫీషియల్ బాండింగ్ పెంచుకోవాలని చూస్తుంది.ఎట్ ప్రజెంట్ కోలీవుడ్లో ఈ జంట గురించే డిస్కషన్ ఎక్కువగా నడుస్తున్నాయి

నయన్-విఘ్నేష్ ల మ్యారీజ్ పై కోలీవుడ్ మీడియా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది.ఇంతకాలం మోసింది చాలు ఇక వదిలించేసుకుందామనుకుంది. ఒకరకంగా చెప్పాలంటే నయన్ ఓ అండర్ స్టాండ్ కు రాకముందే అక్కడి డిజిటల్ మీడియా వీరి కథను క్లయిమాక్స్ కు తీసుకువచ్చేసింది.

విఘ్నేష్-నయన్ పెళ్లికి వచ్చే ఫిబ్రవరి వేదిక కానుంది. ఈ పెళ్లి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఈ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయట్లేదు.జస్ట్ లిమిటెడ్ గా మాత్రమే తమ వెల్ విషర్స్ ను ఈ మ్యారీజ్ ఈవెంట్ కు ఇన్వైట్ చేయనున్నారు.ఒక్కసారిగా వీరి మ్యారీజ్ ముచ్చట ముందుకు రావడానికి రీజన్ వీరిద్దరి పేరెంట్స్ ఒత్తిడే కారణమని తెలుస్తుంది.

‘నానుమ్ రౌడీ ధాన్’ షూటింగ్ సందర్భంగా నయన్-విఘ్నేష్ శివన్ లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారి డేటింగ్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం,నెటిజన్లు వాటిని లైక్ చేయడం గత కొంత కాలంగా జరుగుతూ ఉంది.ప్రస్తుతం వీరిద్దరూ ‘కథువాకుల రెండు కాదల్’ చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు. మొత్తానికి ఎలాగైతేనేం వీరిద్దరి లవ్ ముచ్చట పెళ్లివరకు వచ్చింది.త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news