నయనతారకు కవల పిల్లలు.. ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు !

-

హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ సోషల్​ మీడియాలో ప్రకటించారు. తమ ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు ఫలించాయని పేర్కొన్నారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను షేర్ చేశాడు.

ఈ విషయం పక్కన పెడితే, నయనతార కవలలకు తల్లయిన వేల ఓ టాపిక్ వైరల్ అవుతోంది. అదేంటంటే, నయనతారకు కవల పిల్లలు పుడతారన్న విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేసారని. నయనతారకు కవలలు పుడతారని ఎన్టీఆర్ కి ఎలా తెలుసు అనేగా మీ డౌటు.

అక్కడికే వస్తున్న: 2010లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్, నయనతార, షీలా కౌరు హీరో హీరోయిన్లుగా అదుర్స్ అనే సినిమా వచ్చింది. అందులో చారి పాత్రధారుకి జతగా చంద్రకళ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, నయనతారకు కవల పిల్లలు పుడతారని చెప్తారు. అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. చంద్రకళ ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని, అందుకే ఆమెకు కవలలు పుడతారని చారి చెప్పాడు. అప్పుడు చెప్పిన ఆ విషయం ఇప్పుడు నిజమైందని నేటిజన్లు గుర్తుచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news