Godfather: గాడ్ ఫాద‌ర్ చెల్లెలిగా లేడీ సూపర్ స్టార్.. ఎంత డిమాండ్ చేసిందంటే?

-

Godfather: మెగాస్టార్​ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహన్​ రాజా కాంబో తెర‌కెక్కుతున్న చిత్రం గాడ్ ఫాద‌ర్. పవర్​ఫుల్ పొలిటికల్​ డ్రామాగా ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాలంలో సూపర్​హిట్​ అయినా.. లూసిఫర్​కు సినిమాకు ఇది రీమేక్​. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వ‌చ్చింది.
ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర అయిన హీరో సోద‌రిగా తెలుగులో నయనతార పోషించనుంది. తాజాగా, ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కాగా, ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా నటించేందుకు లేడీ సూపర్ స్టార్ భారీగానే డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ .
ఈ సినిమాలో నయనతార పాత్ర కీలకంగా ఉండనున్న‌ద‌ట‌. ఈ పాత్ర‌లో పవర్​ఫుల్​ లుక్​లో కనిపించనున్న‌ది న‌య‌న‌తార‌. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోలేద‌ని సీని వ‌ర్గాల టాక్.

గాడ్​ఫాదర్​ సినిమాను సత్యదేవ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ఆయ‌న భార్య పాత్ర‌ను నయనతార పోషించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్​ ఓ స్పెష‌ల్ సాంగ్ లో చిరుతో క‌లిసి స్టెప్పులేయనున్నర‌ట‌.

చిరు ప్రస్తుతం వ‌రుస సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య‌ షూటింగ్​ కంప్లీట్ చేసుకుని.. విడదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రీలిజ్ చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్​చరణ్​ కూడా నటిస్తున్నారు. వీరిద్దరూ మవోయిస్టు పాత్రల్లో కనిపించనున్నారు. రామ్​చరణ్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. ఇటీవలే విడుదలైన పాటలు, టీజర్​లు ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమాపై మరింత హైప్​ క్రియేట్​ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news