‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ టీజర్‌ రిలీజ్…అదరగొట్టిన కిరణ్ అబ్బవరం

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. తాజాగా సమ్మెతమేతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. ఇక లెటెస్ట్‌ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం.

ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తిరగకుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను కాసేపటికి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news