Netflix : గుడ్​న్యూస్.. తగ్గిన నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్ ధరలు

-

ఓటీటీల్లో కింగ్​గా వెలుగుతున్న నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్ ధరల్లోనూ రారాజే. గత మూడేళ్లుగా నెట్​ఫ్లిక్స్​కు ఆదరణ పెరుగుతోంది. సబ్​స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ కంటెంట్​ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. నెట్​ఫ్లిక్స్ కూడా మొన్నటిదాకా విదేశాలపైనే ఫోకస్ చేసింది. కానీ భారత్​లో కూడా క్రేజ్ పెరగడంతో ప్రస్తుతం ఈ సంస్థ ఇండియాపై తన ఫుల్ ఫోకస్ పెడుతోంది.

ఇండియా వ్యూయర్స్​ను పెంచుకోవడానికి నెట్​ఫ్లిక్స్​ తన సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్​లో మార్పులు తీసుకొచ్చింది. ఇండియాతో సహా 115 దేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.199 ఉన్న మొబైల్‌ ప్లాన్‌ను రూ.149కి తగ్గించింది. టీవీలు, కంప్యూటర్‌లతో పాటు ఎక్కడైనా యాక్సిస్‌ చేసుకోగలిగే ప్లాన్‌ ఛార్జీని రూ.499 నుంచి రూ.199కి తగ్గించింది. ఇక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకునే వారికి ఇవి సరసమైన ధరలనే చెప్పాలి.

నెట్‌ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దీనివల్ల యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వ్యక్తులతో పంచుకుంటే ఎక్స్‌ట్రాగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మొదట అమెరికాలో అందుబాటులోకి రానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version