యాదమ్మ రాజు పై విరుచుకుపడుతున్న నెటిజన్స్..!

-

పటాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవలే ఇతను స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించి .. పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు . ఈ క్రమంలోనే తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. బంధువులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. అనుకోకుండా బుల్లితెరపైకి వచ్చిన యాదమ్మ రాజు జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి పాపులర్ షోలలో నటించి మరింత పాపులర్ అయి.. అప్పట్లో పలు కామెడీ షోలు చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు తన కామెడీ టైమింగ్ తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్న యాదమ్మ రాజు.. 2020 ఆగస్టు 22న జీ తెలుగులో బాపు బొమ్మకు పెళ్ళంట అనే వినోద కార్యక్రమం మధ్యలో తాను ప్రేమిస్తున్న స్టెల్లాను స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా యాదమ్మ రాజు , స్టెల్లా నిశ్చితార్థ ఫోటోలలో పెళ్లికూతురు స్టెల్లా కి నుదుటిపై బొట్టు కూడా లేదు. నిజానికి యాదమ్మ రాజు హిందూ.. స్టెల్లా క్రిస్టియన్ అమ్మాయి కావడంతో.. కొంతమంది యాదమ్మ రాజు పై విమర్శలు గుప్పిస్తున్నారు..” ఏరా రాజుగా.. మొత్తానికి తల్లిదండ్రుల పుట్టు పూర్వోత్తరాలు , వారి సంప్రదాయాలు అన్ని గాలికి వదిలేసి .. కేవలం ఒక ఆడదాని కోసం మతం కూడా మారినావ్.. నీ ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా.. సిగ్గు లేదా రా నీకు” అంటూ తిట్టడం ప్రారంభించారు నెటిజన్స్..

అయితే మరికొంతమంది ఈ నిశ్చితార్థం చూసి , వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి తెగ కుళ్ళుకుంటున్నారు. అయితే యాదమ్మ రాజు మాత్రం ప్రేమకు కులమతాలు అడ్డుకావని నిరూపిస్తూ తనకు నచ్చిన అమ్మాయిని కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకోబోతుండడంతో ప్రతి ఒక్కరు యాదమ్మ రాజు తెగింపుకు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version