విశ్వ‌క్ సేన్ ఫ్యామిలీ ఫ్యాక్ త‌గ్గించవోయ్!

250

`ఫ‌ల‌క్ నుమా దాస్ హిట్` తో విశ్వ‌క్ సేన్ కు మంచి పేరొచ్చింది. ద‌ర్శ‌కుడిగా న‌టుడిగా అన్నీ తానై చేసిన సినిమా అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. రివ్యూలు తేడాగా వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌రిమిత బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో లాభాలు బాబాగానే వ‌చ్చాయి. అందుకే ఇప్పుడు ఇత‌ర హీరోల సినిమాల్లో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. నిన్న‌టి రోజున యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టించిన నిను వీడ‌ను నీడ‌ను నేనే అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిగా వ‌చ్చి వేదిక‌పై ర‌చ్చ ర‌చ్చ చేసాడు. విశ్వ‌క్ వేదిక ఎక్క‌గానే ప్రాంగ‌ణం మారుమ్రోగింది.ఆయ‌న అభిమానులంతా కేరింత‌లు పెట్టారు. విజిల్స్ వేస్తూ భాయ్ భాయ్ అంటూ కేక‌లు వేసారు. విశ్వ‌క్ సేన్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఆ వేదికే సాక్ష్యం.

మ‌ధ్య‌లో తెలంగాణ యాస‌లో విశ్వ‌క్ వాళ్ల‌ని ఉద్దేశిస్తూ చేసిన చిన్న‌పాటి వ్యాఖ్య‌లు బాగా పేలాయి. ఈ సంద‌ర్భంలో ఒక‌వైపు సీనియ‌ర్లు..మ‌రోవైపు సిక్స్ ఫ్యాక్ లు అంటూ మాట్లాడాడు. ఇప్పుడీ ఈ వ్యాఖ్య‌ను ప‌ట్టుకుని నేటి జ‌నులు ట్రోలింగ్ షురూ చేసారు. ఇండ‌స్ర్టీలో సీనియ‌ర్ కావాలంటే టైమ్ ప‌డుతుంది. కానీ సిక్స్ ఫ్యాక్ మాత్రం వ‌స్తుంది. అంత‌కు ముందు నువ్వు ఫ్యామిలీ ఫ్యాక్ ని త‌గ్గించాలంటూ హాస్యాస్ప‌దంగా కామెంట్లు పెడుతున్నారు. అంద‌రి హీరోల్లానే నిన్ను సిక్స్ ఫ్యాక్ ల‌లో చూడాల‌ని ఉందంటూ ఆయ‌న అభిమానులు సైతం కోరుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇక నిన్న‌టి రోజున విశ్వ‌క్ సేన్ టైట్ హాఫ్ హ్యాండ్ ష‌ర్ట్ వేసుకోచ్చాడు.

దీంతో ఆయ‌న శ‌రీరం మ‌రింత ఎలివేష‌న్ అయింది. బాగా బొద్దుగా క‌నిపించాడు. ష‌ర్ట్ పైబ‌ట‌న్ పెడుతుంటే ఊడిపోయేది. అంత‌కు కుద‌ర‌క‌పోవ‌డంతో బ్యాక్ కు తిర‌గి చాటేసి బ‌ట‌న్ వేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో ఆ బొద్దుత‌నాన్ని త‌గ్గ‌తించాల‌ని అక్క‌డ ఉన్న వాళ్లు సైతం గుస‌గుస‌లాడుకున్నారు. హీరో అయ్యే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. యాక్టింగ్ లో ఈజ్ ఉంది. ఒకేసారి హీరోగా, ద‌ర్శ‌కుడిగా బాధ్య‌త‌లు వ‌హించాడు. తెలుగులో ఇలాంటి పాత్ర‌పోషించి స‌క్సెస్ అయిన వాళ్లు చాలా త‌క్కువ‌. కానీ విశ్వ‌క్ సేన్ తొలి సినిమాతోనే మ‌ల్టీట్యాలెంటెడ్ అనిపించాడు.