‘సరిలేరు నీకెవ్వరు’ నుండి లేటెస్ట్ అప్‌డేట్‌..

-

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడి ఇంటికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్ చిత్రీకరణకి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె పవర్ఫుల్ రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news