ప్రభాస్ పెళ్లిపై కొత్త మాట..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై గత ఐదారేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి ప్రస్థావన ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం ప్రభాస్ కు అలవాటుగా మారింది. బాహుబలి తర్వాత పెళ్లని చెప్పిన ప్రభాస్ ఇప్పుడు సాహో తర్వాత పెళ్లి అంటున్నాడు. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి కూడా కొత్త అప్డేట్ బయటకు వస్తుందని చెబుతున్నారు.

ప్రభాస్ బర్త్ డే నాడు అమ్మాయి ఎవరో చెబుతారని అంటున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహో ఫస్ట్ లుక్ టీజర్ కూడా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తారట. మరి అదే రోజున పెళ్లి గురించి కూడా చెప్పేసి ఫ్యాన్స్ ఆందాన్ని రెట్టింపు చేస్తే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version