‘రక్కమ్మ’గా జాక్వెలిన్ అప్పుడు రాబోతున్నది..కిచ్చా సుదీప్‌తో ‘విక్రాంత్ రోణ’లో చిందులు

-

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల భాష విషయమై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో సోషల్ మీడియా వేదికగా చర్చ జరిపిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే కన్నడ, హిందీ భాషల గురించి డిస్కషన్ జరిగింది. ఈ సంగతులు పక్కనబెడితే..సుదీప్ చేస్తున్న అడ్వెంచరస్ మూవీ ‘విక్రాంత్ రోణ’ కు సంబంధించిన అప్ డేట్ తాజాగా ఇచ్చారు మేకర్స్.

ఈ సాంగ్ ను జాని మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ‘రా రా రక్కమ్మ’ అనే ఈ సాంగ్ లిరిక్స్ ను తెలుగులో ఈ నెల 25న మధ్యాహ్నం 01.05 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇతర భాషల్లోనూ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించారు.

కన్నడ భాషలో ఈ నెల 23న మధ్యాహ్నం 3.05 గంటలకు, హిందీ భాషలో ఈ నెల 24న 1.05 గంటలకు, తమిళ్ భాషలో ఈ నెల 26న మధ్యాహ్నం 1.05 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సదరు పోస్టర్ లో శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నడుముపైన కుండ పెట్టుకుని, కిచ్చా సుదీప్ తో చిందేసినట్లు ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news