అందాల నిధి.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందిగా…

ఇస్మార్ట్ బ్యూటీగా మ‌స్తు పేరు తెచ్చుకుంది నిధి అగ‌ర్వాల్‌. క్యూట్ లుక్ తో కుర్ర‌కారులో క్రేజ్ సంపాదించుకుంది. మొద‌ట బాలీవుడ్ లో ట్రై చేసిన ఈ భామ అక్క‌డ ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్క‌డ ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో హిట్ కూడా కొట్టింది. రామ్ సరసన నటించిన నిధికి ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేద‌నే చెప్పాలి.బ్లాక్ బస్టర్ విజయం తన కంటే మ‌రో హీరోయిన్ నభా న‌టేశ్ కే ఎక్కువ పేరు తెచ్చింది.

ఇక ఈ మ‌ధ్య‌నే మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌న ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ హరి హర వీరమల్లులో నిధి ఆఫర్ దక్కించుకుందని ప్రచారం సాగుతున్నా.. దానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇక తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని తెర‌కెక్కిస్తున్న ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ న‌టిస్తోంది. బాలీవుడ్ రీఎంట్రీ పైనా కూడా సీరియ‌స్ గా ట్రై చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ పిల్ల సోష‌ల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో హీటు పుట్టిస్తుంది.

తాజాగా మరో ఇస్మార్ట్ ఫోటోషూట్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది పూర్తి మాషప్ మిక్స్ డ్ వీడియోలాగా ఉంది. నిధి ప్రతిసారీ ఫొటోగ్రాఫర్లకు సహకరిస్తూ కిల్లర్ లుక్స్ తో యూత్ ను మ‌త్తెక్కిస్తోంది. ఈ వీడియోలో బోలెడంత సైన్స్ ఉంటుందని తెలుస్తోంది. స్టిల్ ఫోటోగ్రాఫర్ అడిగిన భంగిమ కోసం ఎక్స్ ప్రెషన్ కోసం చాలానే జాగ్రత్తలు తీసుకుంది ఈ పిల్ల‌. ప్రస్తుతం ఈ వీడియో విప‌రీతంగా ట్రోల్ అవుతూ వైర‌ల్ గా మారింది.