మోక్షజ్ఞతో రిలేషన్ బయటపెట్టిన నిహారిక..!

మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య స్నేహం అందరికి తెలిసిందే. ఈమధ్య కాస్త రాజకీయ పరమైన విభేధాలు వచ్చాయి తప్ప సినిమా పరిశ్రమలో మాత్రం ఒకరికి ఒకరు మంచి సన్నిహితులుగా ఉన్నారు. అయితే వారే కాదు వాళ్ల పిల్లలు కూడా అలానే క్లోజ్ గా ఉంటున్నారు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల మధ్య స్నేహం ఎలంటిదో అందరికి తెలిసిందే. ఇదిలాఉంటే మెగా డాటర్ నిహారిక మోక్షజ్ఞతో దిగిన పిక్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఓ పక్క బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు అంటాడు.. నిహారిక మాత్రం బాలయ్య కొడుకుతో క్లోజ్ గా ఉంటుంది. నాగబాబు కామెంట్స్ చేసిన టైంలో నిహారిక, మోక్షజ్ఞ విత్ ఫ్రెండ్స్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ పిక్ పై క్లారిటీ ఇచ్చింది నిహారిక. తను డిగ్రీ చేసే టైంలో మోక్షజ్ఞ తన జూనియర్ అని.. ఆ టైంలో దిగిన ఫోటో అదని చెప్పింది. ఇక నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడం అది ఆయన వ్యక్తిగతమని దానిపై నేను స్పందించలేనని చెప్ప్పింది నిహారిక.

ప్రస్తుతం నిహారిక సూర్యకాంతం సినిమా చేస్తుంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది.