అతడితో ‘అతడు’.. మహేష్ మైనపు బొమ్మ వచ్చేసింది..!

వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అయిన మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సెలబ్రిటీస్ మైనపు బొమ్మలు ప్రదర్శన పెట్టడం వారి ప్రత్యేకత. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ మైనపు బొమ్మను సిద్ధం చేశారు. సింగపూర్ లో ప్రదర్శించబడే మహేష్ మైనపు బొమ్మని ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లో ఏ.ఎం.బి సినిమాకు తీసుకొచ్చారు. మహేష్ కూడా ఇదవరకు చూడని తన స్టాట్యూని అతని ఆధ్వర్యంలోనే వాక్స్ స్టాట్యూ మ్యూజియం వారు రివీల్ చేశారు.

ఆ స్టాట్యూని చూసి మహేష్ షాక్ అయ్యాడని చెప్పొచ్చు. అచ్చం మహేష్ లానే తనని తాను అద్దంలో చూసుకున్న విధంగా మహేష్ తన మైనపు బొమ్మని చూసి ఆశ్చర్యపోయాడు. లాస్ట్ ఇయర్ మహేష్ ను కలిసి 200 మెజర్ మెంట్స్ తీసుకుని ఈ స్టాట్యూని తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఫ్యాన్స్ కోసం ఈ మైనపు బొమ్మ ఉంచారు. అయితే కొద్దిరోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది. తర్వాత సింగపూర్ ఐఫా జోన్ లో మహేష్ మైనపు బొమ్మ ప్రదర్శనకు ఉంచుతారు. ఇండియన్ స్టార్స్ మైనపు బొమ్మల పక్కన మహేష్ స్టాట్యూ ఉంటుంది.