పెళ్లి కూతురు లుక్ కోసం మెగా డాట‌ర్ క‌ష్టాలు

-

దేశం మొత్తం లాక్ లాక్ ప్ర‌క్రియ మొద‌లైంది. దీంతో అన్ని రంగాలు రీ ఓపెన్ అవుతున్నాయి. ఇందులో భాగంగా జిమ్‌లు కూడా మొద‌ల‌య్యాయి. అయితే క‌రోనా ఉదృతి మాత్రం ఆగ‌డం లేదు. దీంతో జిమ్‌ల‌కు రావ‌డానికి సెల‌బ్రిటీలు జంకుతున్నారు. కానీ మెగాడాట‌ర్ కొణిదెల నిహారిక్ మాత్రం అస్స‌లు భ‌య‌ప‌డ‌టం లేదు. జిమ్‌లో వ‌ర్క‌వుట్‌లు చేస్తూ హంగామా చేస్తోంది.

నిహారిక జిమ్‌లో హంగామా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త్వ‌ర‌లో ఆమె పెళ్లికి సిద్ధ‌మ‌వుతుండ‌ట‌మే. ఇటీవ‌ల కొణిదెల నిహారిక‌కు గుంటూరుకు చెందిన ఐటీ త‌న‌యుడు చైత‌న్య‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన విష‌చ‌యం తెలిసిందే. డిసెంబ‌ర్‌లో వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు రెండు నెల‌ల స‌మ‌యం వుండ‌టంతో ఫిట్‌గా మ‌రింత అందంగా క‌నిపించ‌డానికి నిహారిక వ‌ర్క‌వుట్‌లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్ర‌స్తుం వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news