ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తిత్లీ తుఫానుకి శ్రీకాకుళంలో చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం నష్టం నివారణ చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా పెద్ద మొత్తంలో సాయం అందించాలని డిమాండ్ చేస్తుంది ఏపి ప్రభుత్వం. ఇదిలాఉంటే ఈ సంఘటనతో మరోసారి సినిమా సెలబ్రిటీస్ అంతా తమ బాధ్యతగా విరాళాలు ప్రకటించడం జరిగింది.
మొదటగా సంపూర్ణేష్ బాబు 50 వేల రూపాయలు తిత్లీ కోసం సిఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారు. ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రాం వంటి వారు ఇప్పటికే పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించారు. అయితే హీరో నిఖిల్ మాత్రం అందరికి భిన్నంగా సంఘటనా ప్రంతానికి వెళ్లి అక్కడ వారికి సహాయాన్ని అందిస్తున్నాడు. తన బృందంతో అక్కడకు వెళ్లిన నిఖిల్ 3 వేల మందికి భోజన వసతి కల్పించాడట.
అంతేకాదు 2500 కిలోల రైస్, 500 దుప్పట్లు ఇవే కాకుండా పవర్ కట్ ప్రాబ్లెం ఉంది కాబట్టి పోర్టబుల్ జెనరేటర్స్ తీసుకుని వెళ్లాడట. నిఖిల్ చేసిన ఈ పనికి అతని మీద రెస్పెక్ట్ పెరిగింది. రీల్ హీరోగానే కాదు రియల్ హీరోగా నిఖిల్ అదరగొట్టాడు అంటున్నారు.