పెళ్లికి అలాంటి కండిషన్ పెట్టిన నిర్మలమ్మ.. తెలిస్తే షాక్..!!

-

నిర్మలమ్మ.. పౌరాణిక కథా చిత్రాలలో హీరోయిన్ గా నటించి..మంచి నటిగా గుర్తింపు పొందిన తర్వాత సినీ ఇండస్ట్రీకి కొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది . తరువాత ఏకంగా 800 చిత్రాలకు పైగా నటించి మంచి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది నిర్మలమ్మ. ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలు పెట్టిన నిర్మలమ్మ అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వంటి పాత్రలకు జీవం పోస్తూ నటనకు నిదర్శనంగా నిలిచింది. నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గంగమ్మ కోటయ్య దంపతులకు గౌడ కుటుంబంలో 1925 వ సంవత్సరంలో జన్మించింది.రంగస్థలం పై మక్కువ పెంచుకున్న నిర్మలమ్మ తన పది సంవత్సరాల వయసులోనే నాటక రంగం లోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఆమె గొంతు సన్నగా ఉండడంతో సతీ సక్కుబాయి నాటకంలో నటిస్తున్నప్పుడు సన్నగా వినిపిస్తున్న డైలాగులకు ప్రేక్షకులు అల్లరి చేసేవారు. ఇక ఆ తర్వాత గొంతు పెద్దగా చేసి స్వరాన్ని మెరుగు పరుచుకుంది రంగస్థల నటుడిగా నాటక ప్రదర్శకులు గా గుర్తింపు పొందిన జి.వి.కృష్ణారావు రాజమణి ని చూసి ప్రేమలో పడ్డారు. అయితే రాజమణి వివాహం చేసుకోవడానికి పెళ్లి చూపులకు ఆమె ఇంటికి వెళ్లగా ఆమె జీవీ కృష్ణారావు తో వివాహం అనంతరం నాటకాలలో నటించకూడదని కండిషన్ పెట్టకూడదని చెప్పింది. ఇక నిర్మలమ్మ పెట్టిన కండిషన్కు మేరకు రెండు కుటుంబాల పెద్దలు నిర్ఘాంతపోయారు.ఇక ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినలేదు. ఇక జీవీ కృష్ణారావు ఆమె కండిషన్ ను ఒప్పుకొని వివాహం చేసుకున్నారు తర్వాత వీరిద్దరూ ఉదయిని అనే నాటక సంస్థను నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు. కొంతకాలం తర్వాత ప్రొఫెషనల్ మేనేజర్గా పలు చిత్రాలకు భారీ చిత్రాలకు పని చేస్తూ చిత్ర నిర్మాణ రంగంలో అందరితో ప్రశంసలు పొందారు. నిర్మాతలకు ఆర్టిస్టులకు తగాదాలు రాకుండా చూసుకునే వారు. ప్రొడక్షన్ మేనేజర్గా జి.వి.కృష్ణారావు నటిగా ఆమెకు సినిమాలలో అవకాశాలు రావడం వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నిర్మలమ్మ దంపతులకు పిల్లలు లేరు కవిత అనే ఒక అమ్మాయి ని తీసుకున్నారు ఇక ఆ అమ్మాయికి పుట్టిన కొడుకు నిర్మలమ్మ మనవడు.నిర్మలమ్మ మనవడు విజయ్ మాదాల పుట్టినప్పటినుండి అమెరికాలోనే ఉన్న విజయ్ తెలుగు మాట్లాడడం లేదు. ఇతడికి శోభ అనే అమ్మాయి వివాహం కాగా ప్రియా అనే కూతురు జన్మనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version