`భీష్మ` టీజర్ వ‌చ్చేసింది.. కెవ్వుకేక అనిపిస్తున్న నితిన్‌..

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ టీజర్ వచ్చేసింది. భీష్మ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. రష్మిక మందన్నా కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాని ఛలో ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే నెల ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఇక తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో నితిన్ లవర్ బాయ్ గా నటిస్తుండగా, రష్మిక అగ్రెసివ్ రోల్‌లో కనిపిస్తోంది.

Nithiin bheeshma Movie Teaser

ఈ టీజ‌ర్‌లో నీ పేరేంటి’ అని నితిన్‌ను సంపత్ అడిగితే.. ‘భీష్మ’ అంటాడు. అప్పుడు ఆయన ‘భీష్మ కాదు భీష్మ సర్ అనాలి’ అంటాడు. ఇందుకు నితిన్ కౌంటర్ గా నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో’ అని అన్న డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. రష్మిక తన అందచందాలతో ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, నరేష్, వెన్నెల కిశోర్, రఘుబాబు కామెడీతో ఆకట్టుకున్నారు. నితిన్ సినిమా నుంచి అభిమానులు ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తారో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని తెలుస్తుంది. అభిమానులు కూడా నితిన్ ఈజ్ బ్యాక్.. టీజ‌ర్ కెవ్వు కేక అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజ‌ర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version