సినిమా రంగంలో చాలా మంది నటీనటులు మల్టీటాలెంటెడ్ ఉన్నారు. కొంత మంది నటనతో పాటు పెయింటింగ్, క్రీడల్లో సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఆటలో సత్తా చాటుతోంది మరో నటీమణి. ఆమె ఎవరో కాదు. మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్ వంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు పొందిన నివేతా పేతురాజ్ గురించి తెలియని వారుండరూ. ఈ భామ సినిమాల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటుతోంది.
తాజాగా నివేతా పేతురాజ్ తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచింది. మధురైకు ప్రాతినిథ్యం వహిస్తున్న నివేతా మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ప్రత్యర్థి జంటపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో ఖాతాలో పంచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ తన సహచర ఆటగాడితో కలిసి ట్రోఫీతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. గతంలోనూ ఈ చిన్నది ఎఫ్1 రేసింగ్లో సూపర్ స్పీడ్లో దూసుకెళ్లింది. సర్టిఫైడ్ కార్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Badminton mixed double champions 🏆 pic.twitter.com/evJQV2BrCG
— Nivetha Pethuraj (@Nivetha_Tweets) January 23, 2024