వెంకీమామకు అందుకే బజ్ లేదా…!

-

నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య వెండితెర మీద అదే క్యారెక్టర్ లో నటిస్తున్న సినిమా వెంకీ మామ. జై లవకుశ సినిమా తర్వాత దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా, సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందుగా దసరా బరిలో దించాలని అనుకున్నారు. సైరా లాంటి పెద్ద సినిమాకు పోటీగా వెళ్ళటం ఇష్టం లేక క్రిస్మస్ కు అనుకున్నారు. క్రిస్మస్ బరిలో నాలుగైదు పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి.

ఇక సంక్రాంతి మీద వెంకీమామ కన్నేసిన సంక్రాంతికి సైతం మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో  సినిమాలు ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ మామ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక సురేష్ బాబు సైతం తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో ఈ సినిమా బడ్జెట్ తో పాటు రిలీజ్ ఖర్చులు పబ్లిసిటీ వడ్డీలు అన్ని కలిపి రు.48 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. దీంతో సోలోగా రిలీజ్ అయితే తప్ప ఈ సినిమాకు లాభాలు వచ్చే పరిస్థితులు కనపడటం లేదు.

ఇక బిజినెస్ వ్యూహ‌కర్త అయిన సురేష్ బాబు సైతం ఈ సినిమా బడ్జెట్ కు తగినట్టుగా ఎలా మార్కెట్ చేయాలో తెలియక చేతులు ఎత్తి వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాకు మాత్రం రు. 18 కోట్ల రేంజ్‌లో రేటు చెబుతున్నారట. జెమినీ టీవీ నుంచి శాటిలైట్ ద్వారా రు. 8 కోట్ల వరకు వచ్చింది. ఇక హిందీ హక్కులు 8 కోట్లు చెబుతున్నట్టు బోగట్టా. అమెజాన్ సైతం రు. 5 కోట్లు ఇచ్చేందుకు ఊగిసలాటలో ఉందని చెబుతున్నారు.

ఏదేమైనా బడ్జెట్ ఎక్కువ కావడంతో పాటు సినిమాకు సరైన డేట్ లేని కారణంగా వెంకీమామపై అటు ప్రేక్షకుల్లోనూ… ఇటు ట్రేడ్ వర్గాల్లో బజ్ అనుకున్నంత ఆసక్తి అయితే లేదని తెలుస్తోంది. ఇక సినిమా బడ్జెట్ కు తగినట్టుగా మల్టీస్టారర్ సినిమా అయినా నిర్మాతలు చెప్పిన రేటుకు కొనేందుకు బయ్యర్లు సైతం వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. మరి వెంకీ మామకు ఫైనల్ గా ఏ డేట్ ఫిక్స్ చేస్తారో ? సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ? అయినా సినిమాకు బ‌జ్‌ వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version