చిన్న హీరోలతో సినిమాలు వద్దు… నిర్మాతల నిర్ణయం…?

-

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా… కమర్షియల్ గానే ఉంటున్నాయి అనేది వాస్తవం. ప్రతీ సినిమా కూడా అదే విధంగా తీస్తున్నారు. అగ్ర హీరోలతో చేసినా చిన్న హీరోలతో చేసినా సరే ఇదే విధంగా దర్శకులు నిర్మాతలు ఆలోచించడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్ కి కరోనా దెబ్బ తగిలింది. దీనితో చాలా మంది నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి.

ఈ నష్టాల నుంచి బయటపడటం ఎలాగో ఇప్పుడు ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే… మన నిర్మాతలు చిన్న హీరోలతో సినిమాలు వద్దని భావిస్తున్నారట. అగ్ర హీరోలతోనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి భారీ సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారట. చిన్న హీరోలను ఇప్పట్లో పట్టించుకోవద్దు అని, ఆర్ధిక కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారితో సినిమాలు చెయ్యాలని చూస్తున్నారట.

టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దర్శకులకు కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు చేస్తున్న సినిమాలను పూర్తి చేసి… అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే మంచిది అని భావిస్తున్నారు. కొత్త హీరోలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని చూస్తున్నారు. అంటే ఈ ఏడాది ఇక చిన్న హీరోల సినిమాలు దాదాపుగా లేనట్టే అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news