మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయో ట్రీట్ ఇచ్చిన సాయి ధరం తేజ్ ..” నో పెళ్ళి ” సాంగ్ లో వరుణ్ తేజ్ …రానా లు కూడా ..!

-

నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటరు”. గత కొంతకాలంగా వరస ఫ్లాపుల్లో ఉన్న ఈ సుప్రీం హీరో రీసెంట్ గా చిత్రలహరి, ప్రతీరోజూ పండగే సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకొని మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఇదే ఊపుతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతూ “సోలో బ్రతుకే సో బెటరు” సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాని ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

తాజాగా ఈ సినిమానుండి “నో పెళ్ళి” అనే సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చాడు సాయి ధరం తేజ్. నో పెళ్ళి సాంగ్ లో సాయి ధరం తేజ్..హీరోయిన్ నభా నటేష్ తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి ఫ్యాన్స్ కి షాకిచ్చారు.

 

అయితే రీసెంట్ గా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాని ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ అండ్ రానా కనిపిస్తారన్న విషయం సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు డైరెక్ట్ గా సాంగ్ చూసిన ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి సర్‌ప్రైజ్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాతో పాటు సాయి ధరం తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా భవాన్, పుల్లా రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా నివేదా పేతురాజ్ నటిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news