ప్రియా ప్రకాశ్ పై మండిపడుతున్న నూరిన్

ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాశ్ తనని తొక్కేసిందని బాధపడుతుంది ఆ సినిమాలో మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్. సినిమాలో ఆమె కూడా అందంగా కనిపిస్తుంది. మొదట కథలో మెయిన్ హీరోయిన్ తానని అయితే ఎప్పుడైతే ప్రియా ప్రకాశ్ టీజర్ సెన్సేషన్ అయ్యిందో సినిమా కథ మార్చేశారని చెప్పింది నూరిన్. ఈమధ్య రిలీజైన ఒరు ఆదార్ లవ్ తెలుగు వర్షన్ లవర్స్ డే ఫ్లాప్ అవగా మళయాళంలో కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు.

అయితే ఈ సినిమా ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది నూరిన్. ప్రియా ప్రకాశ్ కు వచ్చిన పాపులారిటీ వల్ల అప్పటిదాకా అనుకున్న కథని మార్చి తనని సైడ్ హీరోయిన్ చేశారని చెప్పుకొచ్చింది. అయితే ఫ్యూచర్లో ఒరు అదార్ లవ్ హీరో రోషన్ అబ్ధుల్ తో కలిసి నటిస్తా కాని ప్రియాతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా ఒప్పుకోనని అంటుంది నూరిన్.