నరేష్ హార్ట్ లోనే కాదు.. ఫోన్‌ వాల్ పేపర్‌ కూడా ఆమెనే.. ఇదిరా ప్రేమంటే!

-

నరేష్: టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ప్రస్తుతం ఠక్కున గుర్తుకు వచ్చే జంట నరేష్, పవిత్ర లోకేశ్.కొన్ని రోజులుగా వీరిద్దరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఎన్నో వివాదాలు, విమర్శల నడుమ సీక్రెట్​గా సాగిన వీరి రిలేషన్​షిప్​ టాలీవుడ్​-2022లో హాట్​ టాపిక్​గా నిలిచింది. ఇప్పటికీ కొనసాగుతోంది. నరేశ్​ మూడో భార్య రమ్య, పవిత్ర, పవిత్ర భర్త.. మీడియా ముందుకు వచ్చి ఒకరి గురించి ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన వీళ్ల గురించే చర్చ. వార్తల్లో బాగా ట్రెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఓపెన్ గా తిరుగుతున్న ఈ జంట.. ఆ మధ్యలో సడన్‌గా లిప్ లాక్ వీడియోతో ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమని తేలిపోయింది.

నరేష్… తన రియల్ లైఫ్ సంఘటనలతో ఈ సినిమాను చిత్రీకరించినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ.. తన రియల్ లైఫ్ గాథ కాదని, అందరికీ కనెక్ట్ అయ్యే కథ అంటూ చెప్పారు. ఒక వ్యక్తిపై రివెంజ్ తీర్చుకునే అంత డబ్బులు లేవంటూ చమత్కరించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషల్లో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు.

కాగా ఇప్పడు నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంతోష్ శోభన్, మాళవిక జంటగా తెరకెక్కుతున్న మంచి శకునములే సినిమాలో నటించారు. మే 18న విడుదల కాబోతున్న ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ మేకర్స్. నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. పవిత్రనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ షూటింగ్ సమయంలో పవిత్ర భోజనం వండి తీసుకు వచ్చేదని అన్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు క్లిక్ మనగా.. నరేష్ ఫోన్‌పై కెమెరా చూపు పడింది. ఆ ఫోన్ డిసీ ప్లే ఆన్ అవ్వగా వాల్ పేపర్‌గా నరేష్, పవిత్ర ఫోటో కనిపించింది. వీరిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో అనడానికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version