గత కొంతకాలంగా యుక్రెయిన్ మరియు రష్యా దేశాల మధ్యన యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాను హెచ్చరిస్తున్న వినకుండా తన దారిలోనే వెళుతూ యుక్రెయిన్ ను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఆస్థి, ప్రాణ నష్టం తీవ్రస్థాయిలో జరిగాయి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి అత్యవసరంగా ఎటువంటి ప్రకటన చేయకుండా బ్రిటన్ పర్యటనకు వెళ్ళాడు. ఇక్కడ బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ ను కలిసి కీలక విషయాలపై చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జెలెన్ స్కి మాటలను బట్టి చూస్తే యుద్ధంలో సహాయం కోసం బ్రిటన్ అధ్యక్షుడిని కోరినట్లు తెలుస్తోంది.
రష్యా తో యుద్ధంలో సహాయం కోసం హుటాహుటిన బ్రిటన్ వెళ్లిన జెలెన్ స్కి…
-