త్రివిక్రం కలలో నేను భాగమయ్యా : ఎన్టీఆర్

-

స్టార్ డైరక్టర్ అయినా సరే ఒక డిజాస్టర్ వచ్చింది అంటే కచ్చితంగా అతనితో సినిమా అంటే మిగతా హీరోలు వెనక్కి తగ్గుతారు. అయితే ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం చేస్తే అది వేరే లెక్క. అయితే ప్రస్తుతం అలాంటి డేర్ స్టెప్ వేశాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత త్రివిక్రం తో కలిసి అరవింద సమేత సినిమా చేశాడు. ఈ సినిమా టైంలో నందమూరి అభిమానుల టెన్షన్ అంతా ఇంతా కాదు.

ఇదే ప్రశ్నను ఎన్.టి.ఆర్ ముందు ఉంచారు మీడియా వాళ్లు. హిట్లు ఫ్లాపులు తమకు కామన్ అని.. ఒక సినిమా హిట్టు, ఫ్లాపు తర్వాత సినిమా మీద ప్రభావం చూపిస్తాయని తాను నమ్మనని సమాధానం ఇచ్చారట ఎన్.టి.ఆర్. అంతేకాదు త్రివిక్రం కన్న కల అరవింద సమేత వీర రాఘవ ఇందులో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని. త్రివిక్రం చక్కని కథ.. అద్భుతమైన పాత్రలను తీర్చిదిద్దారని.. సినిమా ప్రేక్షకులకు చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా ఉంటుందని.. ఇలాంటి సినిమాలో నటించడం తన అదృష్టమని అంటున్నారు ఎన్.టి.ఆర్.

అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారట. ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ ఇలా మూడింటికి ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news