బాలకృష్ణ లీడ్ రోల్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రెండు మూడు ఫస్ట్ లుక్ లు వచ్చినా వాటిల్లో బాలయ్య అంతగా కనిపించలేదు. ఫైనల్ గా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ వచ్చింది.
పూర్తిస్థాయిలో ఎన్.టి.ఆర్ గా కనిపించి నందమూరి అభిమానులనే కాదు తెలుగు ప్రేక్షకులను అలరించాడు బాలకృష్ణ. క్రిష్ కు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేస్తున్నట్టే అనిపిస్తుంది. సినిమాకు సంబందించిన కాస్టింగ్ అంతా ఇప్పటికే పూర్తి కాగా లేటెస్ట్ గా వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అంచనలాను మరింత పెంచింది.