సలార్, టైగర్​-3లో తారక్ గెస్ట్ రోల్.. అప్డేట్ అదిరిందిగా..!

-

‘ఆర్​ఆర్​ఆర్’​ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా తారాస్థాయికి వెళ్లిపోయింది. వరుస సినిమాలు.. అవి కూడా భారీ బడ్జెట్ మూవీస్​తో ప్రస్తుతం తారక్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్​తో వచ్చిన క్రేజ్​తో బాలీవుడ్​లోనూ తారక్​కు పాపులారిటీ పెరిగింది. దీంతో అక్కడ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్ వార్-2తో హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే తారక్ మరో బాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నాడట. అయితే అది ఫుల్ లెంగ్త్ పాత్ర కాకుండా గెస్ట్ రోల్ అంట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. వైఆర్​ఎఫ్​ స్పై యూనివర్స్ బ్యానర్​లో తెరకెక్కిన సల్మాన్ ‘టైగర్​ 3’తో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో ఆయన షారుక్​- హృతిక్​తో పాటు గెస్ట్​ రోల్​లో కనిపిస్తారని టాక్.

మరోవైపు కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్​ తాజాగా డైరెక్ట్​ చేసిన సినిమా ‘సలార్​’లోనూ తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర క్లైమాక్స్​లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్​లో​ హీరో యశ్​తో పాటు కలిసి జూనియర్ ఎన్టీఆర్​ సర్ప్రైజ్ క్యామియో రోల్​ చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news