ఆసియన్ గేమ్స్ 2023: ఉత్కంఠ పోరులో ఇండియా గెలుపు !

-

చైనాలోని గ్యాంగ్ జౌ లో ఆసియన్ గేమ్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్పటికే తమ ఖాతాలో కొన్ని విభాగాలలో స్వర్ణ పతకాలు సాధించింది. కాగా ఈ రోజు నుండి క్రికెట్ విభాగంలో పురుషులు డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్ నుండి పోటీలో నిలిచారు. అందులో భాగంగా నేపాల్ కు మరియు ఇండియా కు మధ్యన జరిగిన పోరులో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకుని నేపాల్ ముందు 213 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇండియా ఆటగాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 8 ఫోర్లు మరియు 7 సిక్సులు సహాయంతో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇతనికి గైక్వాడ్ 25, శివమ్ దుబే 25 మరియు రింకు సింగ్ 37 ల నుండి చక్కని సహకారం లభించింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ రెండు వికెట్లు తీశాడు. బదులుగా నేపాల్ జట్టు మొదటి నుండి ఆచితూచి ఆడుతూ వరుసగా వికెట్లు కోల్పోయి పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

రవి బిష్ణోయ్ మరియు అవేశ్ ఖాన్ లు తలో మూడు వికెట్లు దక్కించుకోగా, అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. ఇక నేపాల్ లో దీపేంద్ర సింగ్ 32 పరుగులు చేశాడు. కాగా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. ఇండియా లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న టీం నుండి పరుగులు చేయాలంటే ఎంత కష్టమో తెలిసిందే. ఈ విజయంతో ఇండియా సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Latest news