దేవర నుంచి క్రేజీ అప్డేట్.. హిట్ ఫార్ములాతో వస్తున్న శివ కొరటాల

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ మూవీ దేవర. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కిక్కించే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే తారక్ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా చేశారు. ఆంధ్రావాలా, అదుర్స్ వంటి చిత్రాల్లో ద్విపాత్రాభినయం , జై లవకుశలో త్రిపాత్రాభినయంతో అదరగొట్టిన ఎన్టీఆర్.. ఆంధ్రావాలాలో తండ్రీకొడుకులుగా అలరించారు.

ఇప్పుడు మరోసారి తండ్రీ కొడుకులుగా తారక్ కనిపించబోతున్నారని టాక్. అది కూడా దేవర సినిమాలో. ఇప్పటికే తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో మిర్చి సినిమాను తెరకెక్కించిన శివ కొరటాల ఆ హిట్ ఫార్ములాతోనే దేవరను కూడా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించి తారక్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఇక సీక్వెల్లో తండ్రి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలిసింది. కానీ ఈ విషయాలకు సంబంధించి మూవీటీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చాలా రోజుల తర్వాత తారక్‌ను డబుల్ రోల్‌లో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news