ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు -కోట శ్రీనివాసరావు..!

-

ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు విలనిజం పండించి.. ఆ తర్వాత కామెడీ కూడా ప్రేక్షకులకు పంచాడు. వేరువేరుగా వివిధ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించి ప్రతి పాత్రకు జీవం పోస్తూ వచ్చారు. ఇక అలా ఆయన నటనా ప్రస్థానం ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా మొదలయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా వందల కొద్ది చిత్రాలలో నటించిన ఈయన ప్రస్తుతం వయోభారరీత్యా ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు ఆనాటి ముఖ్య సంఘటనను గుర్తు చేసుకున్నారు.

మండలాధీడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఆఫర్ చేశారు. అయితే అప్పటికే ఆ పాత్ర చేయలా? వద్దా? అని ఆలోచిస్తున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ సినిమా చేయమని ప్రోత్సహించారు. నాకేమో ఎన్టీఆర్ అభిమానులు ఎలా తీసుకుంటారో అని భయంగా ఉండేది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం కూడా వచ్చింది. దాంతో ఇక సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉందాం… లేకపోతే ఉద్యోగం చేసుకుందామనుకున్నాను. ఇక అలా మండలాధీశుడు సినిమా మంచి విజయం సాధించింది. కానీ చాలామంది ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఒకసారి నేను నా కూతుర్ని చూడడానికి విజయవాడ వెళ్తే.. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్ అభిమానులు నన్ను తిడుతూ కొట్టడానికి వచ్చారు కొంతమంది ఏకంగా నన్ను కొట్టారు కూడా.. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాసరావు. అయితే ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బ తినడానికి కారణం మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించారు కోటా శ్రీనివాసరావు ఆ సినిమాలో ఎన్టీఆర్ను కించపరిచేలో సన్నివేశాలు ఉండడంతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యి ఆయనను కొట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news