ఎన్టీఆర్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

-

తండ్రి మరణం తనని కలచి వేస్తున్నా ఆ బాధనంతా దిగమింగుకుని సినిమా షూటింగ్ కు రెడీ అయ్యాడు ఎన్.టి.ఆర్. బుధవారం హరికృష్ణ మరణం.. గురువారం అంత్యక్రియలు జరిగాయి. అయితే ఇలాంటి టైంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత సినిమా షూటింగ్ కు రావడం కష్టమని తండ్రి మరణంతో ఎన్.టి.ఆర్ చాలా కుంగిపోయాడని షూటింగ్ వాయిదా పడుతుందని అనుకున్నారు. కాని షెడ్యూల్ ప్రకారం జరుగకుంటే నిర్మాతకు కోట్ల నష్టం వస్తుందని భావించి మరో రెండు రోజుల్లో యదావిధిగా తాను షూటింగ్స్ కు వస్తానని చెప్పారట ఎన్.టి.ఆర్.

సినిమా అంటే ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క సందర్భం చాలు. నిర్మాత కష్టం తెలిసిన హీరోగా తండ్రి దూరమయ్యాడన్న బాధ ఉన్నా సరే తాను షూటింగ్ కు వస్తానని చెప్పాడట తారక్. అనుకున్న విధంగా షూటింగ్ జరుగకుంటే దసరాకి రిలీజ్ కష్టమే అని తెలిసి దర్శక నిర్మాతల శ్రేయస్సుకోరి ఎన్.టి.ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news