వెరైటీ స్టైల్ లో ‘అల వైకుఠపురములో’ ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ లాంచ్….!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఎంతో మంచి హిట్ సాదించాడంతో పాటు అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ గా యూట్యూబ్ లో రికార్డ్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా నుండి ఓ మై గాడ్ డాడీ అనే పల్లవితో సాగె మూడవ సాంగ్ టీజర్ ని నేడు యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ సాంగ్ టీజర్ లో అల్లు అర్జున్ కొడుకు అయాన్ మరియు కూతరు అర్హ కనిపించడం జరిగింది. నేడు చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని సినిమా యూనిట్ ఈ సాంగ్ ని వారిద్దరి పై పిక్చరైజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ లో అర్హ, అయాన్ ఇద్దరూ ఎంతో సరదాగా డాన్స్ చేస్తున్న సీన్స్ మనం గమనించవచ్చు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, బ్లేజి, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్ లు కలిసి ఈ సాంగ్ ని ఆలపించడం జరిగింది.

ఇక ఈ టీజర్ ని బట్టి గమనిస్తే ఇది కొంత వెస్ట్రన్ స్టైల్ లో సాగె సాంగ్ అని అర్ధం అవుతుంది. కాగా ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, మురళి శర్మ, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది సినిమా యూనిట్….!!