మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న అమితాబ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

-

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ఆయన సేవాగుణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తనదైన శైలిలో ఈ సూపర్ స్టార్ మంచి పనులు చేయడమే కాకుండా మంచి పనులు చేసేవారికి కూడా సాయం చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ దేశంలో ఉన్న సమస్యల మీద తనదైన శైలిలో కామెంట్ చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధ జంట పనులు మెచ్చి వారికి కారును బహుమతిగా అందించాడు. ఇంతకీ వాళ్లు చేసిన పనేంటంటే….

అమితాబ్/Amitabh

ప్రస్తుతం వాహనాలు యాక్సిడెంట్లలో చిక్కుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం రోడ్లు బాగా లేకపోవడం. ప్రభుత్వాలు ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తున్నా… ఎక్కడో ఓ చోట రోడ్లపై మనం గుంతలను చూస్తూనే ఉంటాం. కానీ మన దారిన మనం ఆ గుంతలను పట్టించుకోకుండా వెళ్లిపోతాం. కానీ హైదరాబాద్ కు చెందిన 73 ఏళ్ల గంగాధర్ తిలక్ తన భార్య వెంకటేశ్వరితో కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చుతున్నారు. ఈయనను రోడ్ డాక్టర్ గా స్థానికులు పిలుస్తారు. వీరు వాడే కారు గుంతల అంబులెన్స్ గా ప్రసిద్ది గాంచింది. తిలక్ రైల్వేలో 35 ఏళ్లపాటు పనిచేసి రిటైరయ్యారు. అతను రైల్వే జాబ్ వదిలేసిన తర్వాత హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయడానికి సిటీకి వచ్చాడు. అలా సిటీకి వచ్చిన గంగాధర్ నగరం మొత్తం తిరుగుతూ… గుంతలను మట్టితో నింపుతున్నాడు. ఈ పని కోసం తాను సాఫ్ట్ వేర్ కంపెనీలో చేస్తున్న పనిని కూడా మానేశాడు. ఇప్పటి వరకూ తిలక్ దంపతులు నగరంలో 2030 గుంతలను పూడ్చారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని చేయడం కోసమైనా డబ్బులను ఆశించే వారున్నారు. కానీ తిలక్ దంపతులు మాత్రం ఎలాంటి లాభం ఆశించకుండా ఇలా గుంతలను పూడ్చుతున్నాడు. ఆయన చేస్తున్న సేవకు మెచ్చిన అమితాబ్‌ బచ్చన్ కారును బహుమతిగా అందజేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version