రియా డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్‌

రియా డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో డ్రగ్‌ పెడ్లర్‌ కరమ్‌ జీత్‌ ను కొద్ది సేపటి క్రితం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఇప్పటి దాకా మొత్తంగా ఏడుగురు పెడ్లర్లను అధికారులు విచారిస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరి కోసం సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతోంది. సుశాంత్ సింగ్ కేసులో రియా ప్రమేయం మీద జరిగిన విచారణలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.

ఆమెను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో తర్వాత డ్రగ్స్ లింకుల్ని ఛేదించే పనిలో పడింది. రియా చెప్పిన వివరాలతో ఈరోజు ముంబై, గోవాలో సోదాలు నిర్వహిస్తోంది. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు… డ్రగ్స్ పెడ్లర్స్ వివరాలను ఆరా తీస్తోంది. డ్రగ్స్‌. గోవా నుంచి సుశాంత్ ఇంటికి ఆతర్వాత సుశాంత్ ఇంటి నుంచి రియా ఫ్లాట్‌కు వెళ్లినట్లు ఎన్సీబీ గుర్తించింది. రియా పలువరు సినీ సెలబ్రీటలకు డ్రగ్స్ విక్రయించినట్లు కూడా ఆధారాలను సంపాదించింది.