అధికారపక్షాన్ని ప్రతిపక్షాలు ఒక విషయంపై డిమాండ్ చేయడం.. అనంతరం అధికారపక్షం ఆ డిమాండ్ కు అంగీకరిస్తే.. ఆ అంగీకారానికి సంతృప్తి చెందకుండా.. నాడు చేయని, చేయలేని డిమాండ్లు మళ్లీ తెరపైకి తెచ్చి తాము సంతృప్తి చెందలేదని చెప్పడం తెలిసిందే! ఈ క్రమంలో… పవన్ కూడా ప్రస్తుతం అదే పాట పాడుతున్నారు!
వివరాల్లోకి వస్తే… అంతర్వేది రథం దగ్దమైన ఘటనపై విచారణను సీబీఐ కి అప్పగిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై తాజాగా స్పందించారు పవన్. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే… మరికొన్ని కండిషన్స్ పెట్టారు! పిఠాపురం దేవతా విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దగ్ధంల వెనకలా ఎవరెవరున్నారో కూడా నిగ్గు తేల్చాలని.. శ్రీవారి పింక్ డైమండ్ విష్యయంపై కూడా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు! ఇదే క్రమంలో శ్రీకృష్ణ దేవరాయులు.. శ్రీవారికి ఇచ్చిన ఆభరణాలపై కూడా పవన్ సీబీఐ ఎంక్వరీకి డిమాండ్ చేస్తున్నారు!
పూర్తి బీజేపీ నాయకుడిగా మారుతున్న క్రమమో లేక నిజంగానే తత్వం బోదపడిందో ఏమో కానీ… దేవాలయాలపై దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకంటూ తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ దీపాన్ని వెలిగించారు.. అనంతరం ధ్యానం చేశారు!
-CH Raja