OSCAR AWARD : ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండటానికి అదే కారణమట..?

-

ఆస్కార్‌..  ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు ముద్దాడాలని చూసే పురస్కారం.
95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్కార్‌ వేడుకకు ఘన చరిత్ర ఉన్నట్టే.. ఆస్కార్‌ పురస్కార ప్రతిమకూ ఓ హిస్టరీ ఉంది. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్​ వేడుక అట్టహాసంగా జరగనుంది. అయితే ఆస్కార్​ అవార్డు అసలు నగ్నంగా ఎందుకు ఉంటుంది..? దీనికి ఆస్కార్ అనే పేరు ఎలా వచ్చింది..? ఇలా.. ఆస్కార్‌ అవార్డ్​ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.
హాలీవుడ్‌ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ’ ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ‘అకాడమీ ఆవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్‌ పురస్కారాలుగా పిలవడం మొదలైంది.
ఆస్కార్​ అవార్డును ఎవరు సృష్టించారు?
ఆస్కార్‌ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్‌ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్‌ డైరెక్టర్‌ కెడ్రిక్‌ గిబ్బన్స్‌ సృష్టించారు.
ఆస్కార్​ పురస్కారానికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఈ పురస్కారాలకు ఆస్కార్‌ అని పేరు రావడం వెనక ఓ ప్రచారం ఉంది. తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్‌ ఆస్కార్‌లా ఉన్నాడని అందట. ఆ తర్వాత హాలీవుడ్‌ కాలమిస్ట్‌ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్‌ పురస్కారాలని ప్రస్తావించాడట. అలా ‘ఆస్కార్‌’ వాడుకలోకి వచ్చింది.
ఆస్కార్  అవార్డు నగ్నంగా ఎందుకు ఉంటుంది?
ఆస్కార్‌ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్‌ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్‌ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్‌ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.
తొలిసారి ఆస్కార్ అవార్డు​ ఎవరు అందుకున్నారు?
మొదటిసారిగా ఆస్కార్‌ అందుకున్న నటుడు ఎమిల్‌ జన్నింగ్స్‌. ‘ది లాస్ట్‌ కమాండ్‌’ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డు స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news