Rashmika Mandanna : తెలుగు మీడియాకు దూరంగా రష్మిక .. అతడే కారణమా..?

-

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్న. ఈ సినిమాతో బీ టౌన్‌ రష్మికను ఆహ్వానించి మరీ ఆఫర్లు ఇస్తోంది. అలా రష్మిక ప్రస్తుతం మూడు నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు విడుదల కూడా అయ్యాయి. ప్రస్తుతం రష్మిక రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న యానిమల్‌లో నటిస్తోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ  ‘పుష్ప’కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’లో నటిస్తున్న రష్మిక మందన్న.. రీసెంట్‌గా ‘వారిసు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ‘వారసుడు’గా విడుదలైన ఈ మూవీ తమిళంలో జనవరి 11న విడుదల కాగా తెలుగులో మాత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో ఈ మూవీకి విజయ్ జోరుగా ప్రచారం చేశాడు.
దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్‌ రష్మిక మందన్న కూడా అక్కడి తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి విజయ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అయిన రష్మిక అయినా మీడియా ముందుకు వచ్చి ‘వారసుడు’ కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని అనుకుంటే ఆమె కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
అయితే గత కొంతకాలంగా రష్మిక తెలుగు మీడియాకు ముఖం చాటేస్తోంది. ఇలా ఈ క్యూటీ మీడియా ముందుకు రాకపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని వెనక బలమైన కారణం ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రష్మిక- విజయ్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌లో ఉందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ఊతమిచ్చేలా పండుగలకు రష్మిక-విజయ్ ఇంట్లో కనిపించడం.. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లారనే ప్రచారం జరిగింది.
తెలుగు మీడియా ముందుకొస్తే ఈ విషయాలు తప్పకుండా అడుగుతారని భావించే రష్మిక ముఖం చాటేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల రష్మిక విజయ్‌తో రిలేషన్‌షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. విజయ్ తాను కేవలం ఫ్రెండ్సేనని.. క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ అతడితో వెకేషన్‌కు వెళ్తే ఏంటని.. ఫ్రెండ్స్ ట్రిప్స్‌కు వెళ్లరా అంటూ దబాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news