మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వృషభ. నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తుండగా.. తాజాగా ఈ టీమ్‌లోకి హాలీవుడ్‌కు చెందిన నిక్ థర్లో చేరారు. ఆయన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.
అయితే నిక్.. ఆస్కార్ ప్రొడ్యూసర్. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసిన ‘మూన్‌లైట్’ తదితర చిత్రాలకు ‘ఆస్కార్’ అవార్డులు కూడా దక్కడం విశేషం. తాను పనిచేస్తున్న తొలి ఇండియన్ సినిమా వృషభ కావడం చాలా ఆనందంగా ఉందంటూ నిక్ పేర్కొన్నారు. ప్రతి సినిమా తనకు ఓ కొత్త అనుభూతి పంచుతుందని తెలిపారు.
ఇక ‘వృషభ’ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ తనయుడిగా రోషన్ కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనాయా కపూర్ నటిస్తోంది.